చెన్నై : తమిళనాడులోని చెంగల్పట్టులో గురువారం దారుణ హత్య వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు తొలుత నాటు బాంబు విసిరి ప్రజలు చెల్లాచెదురైన అనంతరం హత్య కేసులో నిందితుడిపై కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.
చెంగల్పట్టు కోర్టు కాంప్లెక్స్ వద్ద హత్య కేసు నిందితుడు లోకేష్‌ను సాయుధ దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ కేసు విచారణ నిమిత్తం లోకేష్ చెంగల్పట్టు కోర్టుకు వచ్చాడు. విచారణకు హాజరై వెనుదిరిగిన లోకేష్‌ను జ్యూస్ షాప్ వద్ద బైక్‌పై వచ్చిన దుండగులు అడ్డగించి నాటు బాంబు విసిరి ఆపై కొడవళ్లతో నరకడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
కోర్టు వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఘటనా స్ధలికి పరుగున వచ్చే లోపే దుండగులు పరారయ్యారు. లోకేష్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిందితులని గాలించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Read More :
మనీ బ్యాగ్ కాజేసిన మంకీ : రూ. లక్ష కొట్టేసిన కోతి ఆపై చెట్టెక్కి..!