మనీ బ్యాగ్ కాజేసిన మంకీ : రూ. లక్ష కొట్టేసిన కోతి ఆపై చెట్టెక్కి..!
రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బైక్‌కు వేలాడదీసిన బ్యాగ్‌ను గుంజుకున్న కోతి చెట్టుపైకెక్కి యజమానికి చుక్కలు చూపింది. బ్యాగ్‌లో ఏకంగా రూ. లక్ష ఉండటంతో సదరు వ్యక్తికి చెమటలు పట్టాయి.
లక్నో : రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బైక్‌కు వేలాడదీసిన బ్యాగ్‌ను గుంజుకున్న కోతి చెట్టుపైకెక్కి యజమానికి చుక్కలు చూపింది. బ్యాగ్‌లో ఏకంగా రూ. లక్ష ఉండటంతో సదరు వ్యక్తికి చెమటలు పట్టాయి. యూపీలోని రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ విక్రయ ఒప్పందానికి సంబంధించి ఢిల్లీకి చెందిన షరఫత్ హుస్సేన్ షాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాడు.
అక్కడ బైక్‌ను పార్క్ చేసి దానిపై క్యాష్ బ్యాగ్ ఉంచి పక్కనే ఉన్న బెంచ్‌పై కూర్చున్నాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న కోతి బైక్‌పై ఉన్న బ్యాగ్‌ను తీసుకుని ఎంచక్కా ఉడాయించింది. తన డబ్బు పోయిందని హుసేన్ గ్రహించే లోగా కోతి అక్కడి నుంచి మాయమైంది. మనీ బ్యాగ్‌తో అదృశ్యమైన కోతి సమీపంలోని ఓ చెట్టుపై కూర్చుండటం హుసేన్ గమనించాడు.
దీంతో అక్కడ గుమికూడిన జనం కోతి నుంచి బ్యాగ్‌ను లాగేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి తర్వాత హుసేన్ తన డబ్బుతో పాటు బ్యాగ్‌ను కోతి నుంచి కాపాడుకోగలిగాడు. ఈ ప్రాంతంలో కోతుల బెడద అధికంగా ఉండటంతో కోతులను పట్టుకుని అడవిలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా అధికారులు తెలిపారు.
Read More :
Supreme Court | కేజ్రీ సర్కార్‌కు ఊరట..! కేంద్రం ఆర్డినెన్స్‌పై విచారణ జరిపేందుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

