పీఆర్సీ ప్రకటించండి
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీచర్ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
- పెండింగ్ డీఏలు ఇవ్వండి
- ఉపాధ్యాయుల డిమాండ్
జగిత్యాల టౌన్/ ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 7: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీచర్ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ బాధ్యులు అంబటి భూమేశ్వర్, దాశెట్టి రవీందర్రెడ్డి, నునావత్ రాజు, అచ్చ విజయ్ భాస్కర్, బెజ్జారపు మురళి, వేణుగోపాల్, రామేశ్వర్, అనిల్రెడ్డి, నీలం సంపత్, బన్న గోవింద్, రవీందర్, నరేందర్, రవికంటి పవన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

