న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి ‘అండర్వాటర్ మ్యూజియం- జలాంతర్గామి పర్యాటక ప్రాజెక్ట్’ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ తీరంలో ఏర్పాటుకానున్నది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గుల్దార్ అనే యుద్ధనౌకను సముద్రంలో 22 మీటర్ల లోతున ముంచి దీన్ని రూపొందిస్తారు.
మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఈ ప్రాజెక్ట్ను చేపట్టాయి. నివాటి రాక్ నిర్మాణాల సమీపంలో ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారు.