డెహ్రాడూన్: అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. దీంతో మరణించిన యువకుడి మృతదేహాన్ని వాహనం టాప్‌పై కట్టేసి గ్రామానికి తరలించారు. (Man Body On Vehicle Roof) హృదయ విదారకమైన ఈ సంఘటనపై దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హల్దుచౌడ్‌లోని ఫ్యాక్టరీలో పని చేస్తున్న 20 ఏళ్ల అభిషేక్ శనివారం విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత అభిషేక్ మృతదేహాన్ని సోదరికి అప్పగించారు.
కాగా, పితోర్‌గఢ్‌లోని మారుమూల గ్రామానికి ఆ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు
అంబులెన్స్ డ్రైవర్లు పది వేలకుపైగా డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.
మరోవైపు ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
BJP सरकार में जनता की क्या कद्र है, उसे समझने के लिए ये कहानी जान लीजिए 👇
उत्तराखंड के हल्द्वानी में 20 साल के अभिषेक की मौत हो गई। घर 200 किमी. दूर था, कोई भी शव ले जाने को राजी न हुआ।
एंबुलेंस वालों ने शव घर पहुंचाने के बदले बहन शिवानी से 12 हजार रुपए मांगे।
भाई की मौत का… pic.twitter.com/P1F3rS9t5Y
— Congress (@INCIndia) December 8, 2024