Karnataka | బెంగళూరు : కర్ణాటకలో యువ రైతులను వధువుల కొరత వేధిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొనే వారికి పిల్లను ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక యువరైతులు తమకు వధువు లభించేలా ఆశీర్వచనాలు అందించాలని కోరుతూ ఆలయానికి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
మాండ్య జిల్లాకు చెందిన 30 ఏండ్లుదాటిన పలువురు బ్రహ్మచారులు వచ్చే నెలలో ఆదిచంచనగిరిమఠానికి పాదయాత్రగా వెళ్లి నిర్మలానందనాథస్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు.