న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం వేళ త్రయంబకేశ్వరం ఆలయానికి వెళ్లి.. దేవుడి దర్శనం చేసుకున్న అతడు, తిరుగు ప్రయాణంలో బైక్‌పై కూర్చొని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.
రూ.16 లక్షలు స్టాక్మార్కెట్లో నష్టపోవటం, అప్పులు.. ఆర్థిక కష్టాలు రెట్టింపవ్వటం అతడి ఆత్మహత్యకు కారణమని తెలిసింది. స్థానికులు వెంటనే స్పందించి సత్పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అతడ్ని వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. బైక్ సహా కొల్హే శరీరం 90శాతం వరకు మంటల్లో కాలిపోయింది.
పోలీసులు అతడ్ని సమీపంలోని జిల్లా దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలైన అతడు బుధవారం రాత్రి మరణించారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో కొన్నాండ్లు పనిచేసిన కొల్హే, స్టాక్ మార్కెట్ నష్టాల తర్వాత ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగానికి మారినట్టు పోలీసులు చెప్పారు.