న్యూఢిల్లీ: డీఆర్డీవో కొత్త ప్రయోగం చేపట్టింది. డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. యూఏవీ లాంచ్డ్ ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ యూఎల్‌పీజీఎం-వీ3ని పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు.
భారత క్షిపణి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాజా ట్రయల్స్ దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. యూఎల్‌పీజీఎం-వీ3 సిస్టమ్ అభివృద్ధిలో సహకరించిన డీసీపీపీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. డ్రోన్ క్షిపణి పరీక్ష సక్సెస్ కావడం అంటే.. భారతీయ పరిశ్రమ కీలకమైన రక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల్ని తయారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అని ఆయన తెలిపారు.
In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.
Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ
— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025