న్యూఢిల్లీ: రష్యాతో దాదాపు రెం డేండ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం చెప్పారు. ఒకవేళ కాల్పుల విరమణను ప్రకటిస్తే, ఆ సమయాన్ని రష్యా తన ఆయుధాలను మరింత పెంచుకోవడానికి వినియోగిస్తుందని, ఆ తర్వాత తమను అణచివేస్తుందని చెప్పారు.
యుద్ధ క్షేత్రంలో కాస్త విరామం ఇవ్వడం వల్ల యుద్ధానికి విరామంగా మారబోదన్నారు. ఎస్టోనియా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పరిమితమైన కాల్పు ల విరమణ ప్రకటించాలనే ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయన్నారు. రష్యా కు ఆర్టిలరీ షెల్స్, క్షిపణులు ఉత్తర కొరియా నుంచి వస్తుండగా, డ్రోన్లు ఇరాన్ నుంచి వస్తున్నాయన్నారు.