న్యూఢిల్లీ : ఇండియన్ ఫుడ్‌ను అమితంగా ఇష్టపడే బ్రిటన్ వ్యక్తి జేక్ డ్రేన్ తన ఇన్స్టాగ్రాం ఫీడ్‌ను మన వంటకాలతో నింపేశాడు. ప్రతి వారం ఓ రాష్ట్రానికి సంబంధించిన రెసిపీలను వండి వార్చి పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పటివరకూ తెలంగాణ, ఏపీ, గుజరాత్, రాజస్ధాన్, కర్నాటక, పంజాబ్ సహా పలు రాష్ట్రాల వంటకాలను జేక్ ట్రై చేశాడు.
ఇక జేక్ తయారుచేసిన రవ్వ ఇడ్లీ, సాంబార్ డిష్ తాజాగా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. జేక్ సౌతిండియన్ డిష్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఈ రెసిపీకి పదికి పది మార్కులు ఇచ్చేశారు. పప్పును ఉడికించడంతో జేక్ సాంబార్ ప్రిపరేషన్‌ను మొదలుపెట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రవ్వ ఇడ్లీ చేసేందుకు అవసరమైన పదార్దాలను సిద్ధం చేసుకుని డిష్ రెడీ చేసేవరకూ వీడియోలో జేక్ పనితనం చూడవచ్చు.
తమిళనాడు వీక్‌లో భాగంగా ఇడ్లీ, సాంబార్ సిద్ధం చేశాడు. ఈ వైరల్ వీడియో 25 లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. జేక్ డిష్ అద్భుతంగా ఉందని యూజర్లు ప్రశంసలు గుప్పించారు. రవ్వ ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా ఉందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.