\Viral Video | దేశీ వంటకాల్లో ఆలూ గోబీ ప్రముఖ మెయిన్ కోర్స్ డిష్‌ల్లో ఒకటి. దేశీ కిచెన్‌లో రోజువారీ మీల్స్‌లో భాగమైనా, గెస్ట్‌ల కోసం డిన్నర్ ప్రిపేర్ చేసినా ఆలూ గోబీ మెనూలో ఉండాల్సిందే. అయితే ఈ దేశీ రెసిపీని ఓ బ్రిటన్ చెఫ్ తయారుచేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
బ్రిటన్‌కు చెందిన ఫుడ్ బ్లాగర్, చెఫ్ జేక్ డ్రైన్ తాను ఆలూ గోబీ సిద్ధం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 90 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన పలువురు భారతీయులు కామెంట్స్ సెక్షన్లో జేక్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ వీడియోలో జేక్ పొటాటోలను పీల్ చేసి స్లైసింగ్ చేయడం, ఆపై కాలిఫ్లవర్‌ను కట్ చేసి దాని ఆకులను చిన్న పీస్‌లుగా కట్ చేయడం కనిపిస్తుంది. ఇక ఆలూ గోబీని ఎంతో ఇష్టంగా జేక్ కుక్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.
Read More :