న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో పోలీసులు(Ujjain Police) సుమారు రూ.14 కోట్ల 60 లక్షల నగదును సీజ్ చేశారు. ఆ ఇంటి నుంచే ఏడు కిలోల వెండి, ఏడు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన రెండో రహస్య ప్రదేశాన్ని కూడా పోలీసు రెయిడ్ చేశారు. అక్కడ 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, ఏడు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీయూష్ చోప్రా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఐజీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.