న్యూఢిల్లీ: అలైడ్, హెల్త్‌కేర్ ప్రోగ్రామ్స్‌ను ఆన్లైన్ పద్ధతిలో ఆఫర్ చేయరాదని ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలిచ్చింది.
నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టం, 2021 పరిధిలోకి వచ్చే కోర్సులను 2025 జూలై-ఆగస్టు అకడమిక్ సెషన్ నుంచి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లేదా ఆన్లైన్ మోడ్‌లో ఆఫర్ చేయవద్దని తెలిపింది. స్పెషలైజేషన్‌గా సైకాలజీని కూడా ఆఫర్ చేయరాదని స్పష్టం చేసింది.