Uddhav Thackeray : బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపడంతో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఈ ఉదంతంపై స్పందించారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటనకు నిరసనగా స్ధానికులు రైళ్లను నిలిపివేశారు. బద్లాపూర్ ఘటనపై జనాగ్రహం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. బద్లాపూర్ స్కూల్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఎక్కడా జరగరాదని ఇది అత్యంత విచారకరమని ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం శక్తి బిల్లును ఆమోదింపచేసే ప్రయత్నంలో ఉండగానే ప్రభుత్వాన్ని ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే కూల్చివేశారని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసిన వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారని వారు శక్తి బిల్లును ఆమోదించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. కాగా, బద్లాపూర్ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
పాలకులు మహిళా హక్కుల కోసం పోరాడతామని, వారికి న్యాయం చేస్తామని ప్రతిసారీ చెబుతుంటారని, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత మహిళల సమస్యలను ఏ ఒక్కరూ వినిపించుకోరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన పధకం కింద ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదని, మహిళల భద్రతే ముఖ్యమని ఇవాళ బద్లాపూర్ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తున్న వారు కోరుతున్నారని ఆమె వివరించారు.
Read More :