ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు, విడిపోయిన బంధువులు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలను మరాఠా భాషా ఉద్యమం తిరిగి కలపనుంది. 1-5 తరగతి విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని, ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఇరువురు కలిసికట్టుగా ఆందోళన నిర్వహించనున్నారు.
జూలై 5న చేపట్టే ఈ ఆందోళనలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకోనున్నారు. త్రిభాషా సూత్రాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని ఇరు పార్టీల నేతలు గురువారం ప్రకటించారు.