వ్యాపార విస్తరణకు ఉబర్ అడ్డదార్లు
అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాజీ కమిషనర్ నీలీ క్రోస్ వంటివారుండటం గమనార్హం. ఉబర్‌కు తమ పదవీకాలాల్లో వీరంతా ఎలా సహకరించారో బయటపడింది
సహకరించిన బడా రాజకీయ నాయకులు
న్యూఢిల్లీ, జూలై 11: అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాజీ కమిషనర్ నీలీ క్రోస్ వంటివారుండటం గమనార్హం. ఉబర్‌కు తమ పదవీకాలాల్లో వీరంతా ఎలా సహకరించారో బయటపడింది. 2013-17 మధ్య ఇందుకు సంబంధించిన ఆధారాలు పెద్ద ఎత్తున వెలుగుచూశాయి. ‘ఉబర్ ఫైల్స్’గా చెప్పుకుంటున్న ఈ సమాచారం ది గార్డియన్, ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు దొరికింది. ఈ డాక్యుమెంట్లలో 83వేల ఈ-మెయిల్స్, వెయ్యి ఇతర ఫైల్స్సహా మొత్తం 1.24 లక్షలకుపైగా రికార్డులుండగా.. ఉబర్, ఆయా దేశాల కీలక నేతల సంభాషణలు బయటికొచ్చాయి. మొత్తానికి ఐరోపా ట్యాక్సీ రంగాన్ని దెబ్బతీయడానికి ఏటా కోట్లాది డాలర్లు ఖర్చు చేసిన ఉబర్.. తద్వారా తమకు నచ్చినవారిని గద్దెనెక్కించి లాబీయింగ్ చేసిన విధానం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
నిజానికి ఎన్నోసార్లు ఉబర్‌కు వ్యతిరేకంగా ఫ్రెంచ్ క్యాబ్ డ్రైవర్లు నిరసనలు చేసినా.. వాటన్నిటినీ మ్యాక్రాన్ ఏదో ఓ రకంగా అణిచివేశారు. అప్పటి ఈయూ కమిషనర్ క్రోస్ సైతం ఇందుకు తనవంతు సాయం చేశారు. మరోవైపు గతంలో తాము అవలంభించిన విధానాలు తప్పేనని ఉబర్ అంగీకరించడం గమనార్హం. అయితే ఇప్పుడున్న సంస్థ వేరేనని వ్యాఖ్యానించింది. 2017 నుంచి సీఈవో డారా ఖోస్రోవ్షహీ నాయకత్వంలో సంస్థ నడుస్తున్నట్టు ఉబర్ ఓ తాజా ప్రకటనలో తెలియజేసింది. మరోవైపు భారత్‌లో ఉబర్ కార్యకలాపాల విస్తరణకూ ఈ ఇల్లీగల్ వ్యవహారం అడ్డంకి కాగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదట్లో సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న ఉబర్.. తర్వాతి కాలంలో 72 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 44 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bribe
- Business
- expansion
- Politician
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

