Jyoti Malhotra | న్యూఢిల్లీ : గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా స్పాన్సర్లలో ఒకటైన యూఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ వీగోపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. పాకిస్థాన్‌లో కార్యకలాపాల నిర్వహణకు ఈ కంపెనీకి సరైన ట్రావెల్ ఏజెన్సీ లైసెన్స్ ఉంది. దీనికి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అక్రిడిటేషన్ కూడా ఉంది. సింగపూర్, దుబాయ్‌లలో దీని కార్యాలయాలు ఉన్నాయి.
ఈ కంపెనీ పాకిస్థాన్‌కు నిధులు ఇచ్చినట్లు ఆధారాలు లేవు. కానీ పాకిస్థాన్‌లో దీని కార్యకలాపాలపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హర్యానా పోలీసు కస్టడీలో ఉంది. ‘ఆపరేషన్ సిందూర్’ జరుగుతున్న సమయంలో ఆమె పాకిస్థానీ నిఘా అధికారులతో మాట్లాడినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.