న్యూఢిల్లీ, జూన్ 12: జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల ఎదురుకాల్పుల్లో కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యాడని అధికారులు బుధవారం వెల్లడించారు.
సైదా సుఖాల్ గ్రామంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు దాదాపు 15 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు, భదేర్వాహ్-పఠాన్‌కోట్ రోడ్‌పై ఒక చెక్‌పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లతో సహా ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి.