శ్రీనగర్, ఆగస్టు 28: భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధికారులు ఎక్స్‌లో తెలిపారు.
పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ దేశం ద్వారా బీహార్ రాష్ట్రంలోకి ప్రవేశించారన్న వార్తలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ముగ్గురు అనుమానితుల రేఖా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. రాష్ట్రంలో ముందు జాగ్రత్తగా హైఅలర్ట్ ప్రకటించారు.