Fire Accident : అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హమ్ (Birmingham)లో అగ్నిప్రమాదం సంభవించింది. తెలుగు విద్యార్థుల ఉంటున్న అపార్ట్మెంట్లో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీ, తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థు్లు బర్మింగ్హమ్లో ఉంటూ.. అలబామా యూనివర్సిటీలో చదువుతున్నారు. శుక్రవారం వీరు ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేసి.. విద్యార్దులను బయటకు తీసుకొచ్చారు. అయితే.. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలైన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. బర్మింగ్హమ్లో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అమెరికాలోని తెలుగు సంఘాలు, అలబామా యూనివర్సీటీ అధికారులు వెంటనే స్పందించారు. ప్రమాదంలోంచి బయటపడిన.. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన సహాయం చేస్తున్నారు.