న్యూఢిల్లీ: ఇద్దరు భారతీయులకు రెండు వేర్వేరు కేసుల్లో యూఏఈలో మరణశిక్ష అమలైంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఉరిశిక్షకు గురైన ఇద్దరిని కేరళకు చెందిన ముహమ్మద్ రినాశ్ అరన్గిలోత్తు, మురళీధరన్ పెరుమ్త్తట్ట వలప్పిల్గా గుర్తించింది.
ముహమ్మద్ ఓ యూఏఈ పౌరుడిని, మురళీధరన్ ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలారని తెలిపింది. వీరి మరణ శిక్షల గురించి యూఏఈ గత నెల 28న భారత దౌత్య కార్యాలయానికి సమాచారం అందించింది. దౌత్య కార్యాలయం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో దోషులకు ఊరి శిక్ష అమలైంది.