Nitin Gadkar | ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రూ.65వేలకోట్లతో రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని డెహ్రాడూన్‌కు కలిపే ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణమైతే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు చేరుకునేందుకు రెండుగంటలు, హరిద్వార్‌కు గంటన్నరలో చేరుకోవచ్చన్నారు.
ఇప్పటికే మీరట్‌కు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించామని, ముజఫర్‌నగర్‌ను అనుసంధానించే పనులు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందే ప్రభుత్వం వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ పొడువు ఉన్న హైవే ప్రాజెక్టుల కోస బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (OBT) మోడల్లో రూ.1.5 నుంచి రూ.2లక్షల కోట్లతో రోడ్లను నిర్మిస్తుందని గతంలో తెలిపారు.