థాణె: తెలిసో, తెలియకో తప్పు చేసి దిద్దుబాటు, పశ్చాతాపం కోసం ప్రభుత్వ పరిశీలన గృహంలో ఉంటున్న ఇద్దరు బాలికలు అక్కడే ఉన్న మరో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఈ లైంగిక దాడి ఘటన మహారాష్ట్రలోని థాణె జిల్లా ఉల్హాస్ నగర్ చిల్ట్రన్ హోంలో ఈ నెల 2, 3న జరిగింది.
ఇద్దరు బాలికలు(15, 17) మరొక బాలిక(14)పై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు సోమవారం వెల్లడించారు. పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు.