న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండు గర్భ సంచులతో పుట్టిన ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రెండు పిండాలు ఒకే గర్భసంచిలో కాక చెరో సంచిలో పెరిగాయి. అమెరికాలోని నెబ్రాస్కాలో ఈ అరుదైన ఘటన జరిగింది. మేఘన్ ఫిప్స్ వయస్సు 24 ఏండ్లు. పుట్టుకతోనే ఆమెకు రెండు గర్భ సంచులు ఉన్నాయి. కొంత కాలం కింద ఆమె గర్భం ధరించారు. తన కడుపులో ఒకే బిడ్డ ఉందని తొలుత అనుకొన్నారు. పరీక్ష చేసిన వైద్యులు అసలు విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయారు. గర్భం ధరించిన 22 వారాలకే ఆమె ప్రసవించారు. జూన్ 11న రైలీ, జూన్ 12న రీస్ అనే అమ్మాయిలకు జన్మనిచ్చారు. ఇద్దరూ అర కిలో కంటే తక్కువ బరువు ఉన్నారు. అయితే, 12 రోజుల తర్వాత రైలీ చనిపోయింది.