బెంగళూరు, మే 27: కర్ణాటకకు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారన్న కారణంతో ఎస్టీ సోమశేఖర్, ఏ శివరామ్ హెబ్బర్‌లను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయేంద్ర వెల్లడించారు. యశ్వంత్‌పూర్, యల్లాపూర్ అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు.
2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి,బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావటంలో కీలక భూమిక వహించారు. బీజేపీ టికెట్‌పై 2023లో గెలుపొందారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారని అధిష్ఠానం షోకాజ్ నోటీసిచ్చింది.