న్యూఢిల్లీ, జూలై 6 : మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం ఉఖ్రుల్ జిల్లాలో సాయుధులైన ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు దిగటంతో..అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నుంగ్‌షాంగ్ కాంగ్ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి.
ఘటనాస్థలంలో దాదాపు రెండు గంటలపాటు తీవ్రమైన కాల్పులు, వరుస పేలుళ్లు కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరుగడం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది. 40 అస్సాం రైఫిల్స్‌కు చెందిన షాంగ్షాక్ బెటాలియన్ సిబ్బంది జిల్లా ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.