Assam Rifles | అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు..!
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు దాడి చేశారు.
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు దాడి చేశారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయాల కారణంగా ఇద్దరు సైనికులు మరణించారు. గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని భారత సైన్యం తెలిపింది.
ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు శుక్రవారం సాయంత్రం 407 టాటా వాహనంలో పారామిలిటరీ దళాలు వెళ్తున్నాయి. చురాచంద్ఫూర్ మార్గం సమీపంలోని నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలో వీళ్ల వెహికిల్ లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాల్లో ఒక అధికారి తీవ్రంగా గాయాలతో కనిపించాడు.
Two Assam Rifles personnel, including one JCO and one jawan, were killed in an attack by terrorists in the Bishnupur district of Manipur. Two jawans are injured. The terrorists escaped in a white van after attacking the vehicle in which the troops were travelling on a busy road.… https://t.co/UOgaDOEGGo
— ANI (@ANI) September 19, 2025
అస్సాం రైఫిల్స్‌పై దుండగులు కాల్పులు జరిపిన ప్రాంతం ఇంఫాల్ విమానాశ్రయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే.. ఈ దాడికి తెగబడింది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. సైనికులను చంపాలనే లక్ష్యంతో జరిగిన ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకుంది సైన్యం. నిందితుల కోసం వేట ప్రారంభించిన సైన్యం.. వాళ్ల ఉద్దేశం ఏంటీ? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

