బెంగళూర్ : ముంబై, బెంగళూర్ వంటి నగరాల్లో తలదాచుకునేందుకు సరైన వసతి దొరకడం ఏమంత సులభం కాదు. చాలీచాలని స్ధలంలో అన్నీ సర్ధుకోవాల్సిన పరిస్ధితి. ఇంటికి బాల్కనీ ఉంటే రూం స్పేస్ అరకొరగా..అదే రూంలో తగినంత స్ధలం ఉంటే ఇంటికి సరైన వెంటిలేషన్ ఉండదు.
బెంగళూర్‌లోని అపార్ట్మెంట్ ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా (Viral Post) ఆ ఫొటో నగరంలో అద్దె ఇండ్ల దుస్ధితిని వెల్లడిస్తుంది. అయితే ఇది ఇల్లు కాదు రూం అని ట్విట్టర్ యూజర్లు ఆ ఫొటోపై రియాక్టయ్యారు.
Finally found a fully furnished home in blr. Gated society and 24×7 security. pic.twitter.com/snSQIr9iPC
— Manthan Gupta (@manthanguptaa) March 31, 2023
ఈ ఫొటోలో ఓ చిన్న రూంలో బెడ్, స్మాల్ విండో అక్కడే ఓ వాష్ బేసిన్ కనిపిస్తాయి. ఎట్టకేలకు బెంగళూర్‌లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు లభించింది. గేటెడ్ సొసైటీ, 24 గంటల సెక్యూరిటీ అని ఈ ఫొటోకు మంథన్ గుప్తా క్యాప్షన్ ఇచ్చారు. ఇది ఇల్లా లేక జైలు సెల్నా యూజర్లు రియాక్టయ్యారు.
Read More