Jacqueline Fernandez | సుకేష్ చంద్రశేఖర్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారనున్న నటి జాక్వెలిన్
Jacqueline Fernandez : మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్‌గా మారబోతుంది.
Jacqueline Fernandez : మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్‌గా మారబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఢిల్లీ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కోర్టు.. తను అప్రూవర్‌గా మారాలనుకుంటున్న విషయాన్ని ఈ కేసును విచారిస్తున్న ఈడీకి చెప్పాలని సూచించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రకారం.. అప్రూవర్‌గా మారాలనుకుంటున్న విషయాన్ని జాక్వెలిన్ ముందుగా విచారణ సంస్థకు తెలియజేయాలి.
ఆ తర్వాత వారు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. తర్వాత, ఈ వాంగ్మూలం ఆధారంగా ఆమెను అప్రూవర్‌గా మార్చి, ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకురావాలా.. వద్దా అనేది నిర్ణయిస్తారు. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉంది. ఈ అంశంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన క్రిమినల్ చర్యలను రద్దు చేయాలని కోరుతూ గతంలో జాక్వెలిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ, దీనికి కోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం జాక్వెలిన్ అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖరన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అతడికి బెయిల్ లభించింది. అతడు ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. సుకేష్, జాక్వెలిన్ కొంతకాలం క్రితం రిలేషన్లో ఉన్నారు. ఇదే సమయంలో సుకేష్ పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు.
అలాగే, ఆ డబ్బులో చాలా వరకు జాక్వెలిన్‌కు అతడు ఖరీదైన గిఫ్ట్‌ల రూపంలో ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కార్లు, నగలు, బ్రాండెడ్ దుస్తులు వంటివి కలిపి రూ.7 కోట్ల విలువైన గిఫ్టులను సుకేష్.. జాక్వెలిన్‌కు ఇచ్చాడు. అప్పటికే అతడిపై అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నప్పటికీ, జాక్వెలిన్ వాటిని స్వీకరించింది. దీంతో ఆమెపై కూడా ఈడీ కేసు నమోదు చేసి, 2022లో చార్జిషీటు కూడా సమర్పించింది. మరోవైపు ఈడీ ఆరోపణల్ని జాక్వెలిన్ ఖండించింది. సుకేష్ ఆర్థిక నేరాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

