Maoists : ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలో మరో 12 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ (Ramdher) ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (MMC) జోన్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. మిళింద్ తెల్టుంబే మరణించినప్పటి నుంచి రాంధెర్ ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు.
ప్రస్తుతం రాంధెర్ లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా మారినట్లయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ చేపట్టినప్పటి నుంచి పలువురు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విడతలు, విడతలుగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 12 మంది లొంగిపోయారు.