Electric Scooter : టీవీఎస్ సంస్థ త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీవీఎస్ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియో iQube లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిగి ఉంది. మార్కెట్లో వినియోగదారుల నుంచి కూడా దానికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు కొత్త మోడల్‌ను జోడించాలని యోచిస్తోంది.
టీవీఎస్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 2025 నాటికి కొత్త మోడల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి ఇన్వెస్టర్ కాల్లో ధృవీకరించబడింది. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ దాని EV ప్లాన్ల గురించి మాట్లాడారు. కంపెనీ చాలా వేరియంట్లలో iQube ను విక్రయించనుందని చెప్పారు. iQube భారతదేశంలో చాలా సక్సెస్ అయ్యిందన్నారు.
టీవీఎస్ కంపెనీ X స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఉత్పత్తికి సంబంధించిన సమస్యల కారణంగా దాని డెలివరీలు ప్రారంభం కాలేదు. కంపెనీ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా ప్రారంభించనుంది. ఈ రాబోయే బైక్ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కంపెనీ జుపిటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను, ఎలక్ట్రిక్ XL ను కూడా పరిచయం చేయవచ్చు.