TVK Vijay | కూటమి పార్టీల ఒత్తిడికి తలొగ్గిన విజయ్.. ఓఎస్డీగా రాధన్ పండిట్ తొలగింపు
TVK Vijay : తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
TVK Vijay : తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో బుధవారం అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఓఎస్డీగా రాధన్ పండిట్ నియామకాన్ని టీవీకే కూటమిలోని పార్టీ నేతలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రాధన్ పండిట్ తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన ఆస్ట్రాలజర్. ఎంతోమంది ప్రముఖుల విజయాన్ని ముందే ఊహించారు. జయలలిత రాజకీయ భవితవ్యం గురించి గతంలో కచ్చితంగా చెప్పగలిగారు. తాజాగా, టీవీకే ప్రభుత్వాన్ని స్థాపించిన విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన గతంలోనే చెప్పారు. ఇదే సమయంలో ఆయన విజయ్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. టీవీకే తరఫున పలు మీడియా సంస్థల చర్చల్లో పాల్గొన్నారు.
ఆయన ఊహించినట్లే విజయ్ తమిళనాడులో అధికారం చేపట్టారు. సీఎం అయ్యారు దీంతో విజయ్.. ఆయనను తన ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయంపై టీవీకేతో కూటమిలో ఉన్న ఎంజేకే, డీఎండీకే, వీసేకే వంటి పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. రాధన్ పండిట్ నియామకాన్ని తప్పుబట్టారు. డీఎంకే, ఆ కూటమి పార్టీలు కూడా ఈ విషయంలో విమర్శలు చేశాయి. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓఎస్డీ అంటే.. రాజకీయంగా సమన్వయం చేయడంతోపాటు సలహాదారుగా కూడా పని చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

