Tushar Gandhi | తిరువనంతపురం : మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తుషార్ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడు తూ బీజేపీ, ఆరెస్సెస్ చాలా ప్రమాదకరమైన, కపటత్వం గల శత్రువులని, అవి కేరళలో ప్రవేశించాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదని శుక్రవారం తుషార్ స్పష్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ డిమాండ్ చేశాయి. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి వీ మురళీధరన్ మాట్లాడుతూ.. గాంధీ ముని మనవడు తుషార్ చాలా కాలం నుంచి తన ముత్తాత పేరును వాడుకుని, లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.