హైదరాబాద్: టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానాల గురించి చైర్మెన్ బీఆర్ నాయుడు(TTD chairman BR Naidu) వివరించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల భూమి లీజు రద్దును కోరుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంనున్నట్లు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. ఆ ప్రాజెక్టును దేవలోకం అని పిలిచేవారని, ప్రభుత్వ భూమిని దేవలోకం ప్రాజెక్టు కోసం టూరిజం శాఖకు అప్పగించినట్లు చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, ఆ భూమిని ముంతాజ్ హోటల్‌కు అప్పగించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఆ స్థలం ఆలయానికి సమీపంలో ఉంటుందని, హిందువులను మనోభావాలకు వ్యతిరేకమని, అందుకే పాలకమండలి సమావేశంలో లీజు రద్దు కోరుతూ తీర్మానం చేశామని, ఆ భూమిని ఆలయానికి అప్పగిస్తామని టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు.
#WATCH | Hyderabad, Telangana: On TTD board passing a resolution asking the state govt to cancel allotment of 20 acres of land near Alipiri to build Mumtaz Hotel, TTD chairman BR Naidu says, “When Chandrababu Naidu was the CM, the original project at that time was… pic.twitter.com/zwaGjQY9kd
— ANI (@ANI) November 19, 2024