లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలున్నాయంటూ తనను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. బ్లాక్ మెయిలింగ్ చేస్తూ, కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ఐదుగురూ బీపీవో ఉద్యోగులే కావడం విశేషం. లఖింపూర్ ఖేరీ ఘటనకి సంబంధించిన సాక్ష్యాలున్నాయని బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కార్యాలయం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.