సతారా, అక్టోబర్ 25: ఒక పోలీస్ అధికారి తనను నాలుగుసార్లు రేప్ చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న బీజీపీ పాలిత మహారాష్ట్రలోని వైద్యురాలు, ఆ పోలీస్ అధికారే కాదు, ఒక ఎంపీ కూడా తప్పుడు వైద్య నివేదికలు ఇవ్వాలంటూ తనను ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీనిపై ఆమె బంధువొకరు మీడియాతో మాట్లాడుతూ అసహజ మరణాల కేసుల్లో పోస్ట్‌మార్టం నివేదిక మార్చాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చేదని, అంతే కాకుండా వివిధ కేసుల్లో అరెస్టయ్యి దవాఖానకు తీసుకువచ్చే నిందితుల వైద్య పరీక్షల నివేదికలు కూడా మార్చమని బలవంతం చేసేవారని చెప్పారు.
సతారా పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్ష కోసం తీసుకెళ్లినప్పుడు నిజానికి అతడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు ఫిట్ కాదని బాధితురాలు ఇచ్చిన వైద్య నివేదిక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలా మూడు, నాలుగుసార్లు జరగడంతో పోలీసులు జిల్లా మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కౌన్సిల్ వైద్యురాలి వివరణ కోరింది. వైద్య నివేదికను మార్చమంటూ ఒక ఎంపీ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆమె కౌన్సిల్‌కు రాతపూర్వక వివరణలో పేర్కొన్నారు.