న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా రుసుమును 1 లక్ష డాలర్లు (రూ.88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. దీని అమలుకు గడువును ఈ నెల 21 ఉదయం 9.31 గంటలుగా నిర్ణయించడం మరింత ఆందోళనకు గురి చేసింది.
దుర్గా పూజల కోసం భారత దేశానికి వచ్చేందుకు విమానాలు ఎక్కినవారు ట్రంప్ ప్రకటన గురించి తెలుసుకుని, హుటాహుటిన దిగిపోయారు. మరోవైపు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే విమానాల టిక్కెట్ ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయి. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే టిక్కెట్ ధర రూ.37,000 నుంచి రూ.70,000-80,000కు పెరిగింది. ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల్లో ఈ పెరుగుదల కనిపించింది.