ముంబై: రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అటుగా వచ్చిన రైలు ఆ లారీని ఢీకొట్టింది. (Truck Collides With Train) ఈ సంఘటనలో ఆ లారీ రెండు ముక్కలైంది. రైలు ఇంజిన్ ముందు భాగం వద్ద పొగలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో బోద్వాడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గోధుమల లోడ్‌తో ఉన్న లారీ రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అటుగా వచ్చిన ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్ ఆ లారీని ఢీకొట్టింది.
కాగా, ఈ ప్రమాదంలో ఆ లారీ రెండు ముక్కలైంది. రైలు ఇంజిన్ ముందు భాగం వద్ద పొగలు వచ్చాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకున్నారు. రైలు ప్రయాణికులు, లారీ డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. బ్రిడ్జీ అందుబాటులోకి రావడంతో రైల్వే క్రాసింగ్ వినియోగంలో లేదని చెప్పారు. అయినప్పటికీ లారీ అటుగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.
మరోవైపు రైలు ఢీకొనడంతో పట్టాలపై విరిగి పడిన లారీని క్రేన్ సహాయంతో తొలగించారు. దీంతో కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Maharashtra: A truck collided with Mumbai-Amravati Express at Bodwad Railway station between Bhusawal and Badnera sections of the Bhusawal division. The incident occurred when the truck crossed a closed railway crossing. There is no injury to the truck driver or any… pic.twitter.com/WLE1YCN6I4
— ANI (@ANI) March 14, 2025