డునాట్ డిస్టర్బ్ సర్వీస్: స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేసేలా ట్రాయ్ డునాట్ డిస్టర్బ్ సర్వీస్(డీఎన్డీ)ను అమలు చేస్తున్నది. ఆ సర్వీస్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రికి నిద్రపోయే వరకు రోజుకు కనీసం 10 స్పామ్ కాల్స్ మనకు టచ్‌లోకి వస్తాయి. ముఖ్యమైన పని ఉండగా, పలు కంపెనీల టెలికాలర్స్ ఫోన్ చేసి విసిగించే సందర్భాలు అనేకం. ఇలాంటి కాల్స్‌కు ఒకే దెబ్బకు చెక్ పెట్టవచ్చు.
మై జియో యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సర్వీస్ సెట్టింగ్స్‌లో డునాట్ డిస్టర్బ్ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఎయిర్టెల్.ఇన్ సైట్లోకి వెళ్లి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీని వెరిఫై చేయాలి. అనంతరం క్యాటగిరీలు సెలెక్ట్ చేసుకొని బ్లాక్ చేయొచ్చు.
డిస్కవర్.వొడాఫోన్.ఇన్ సైట్లో డీఎన్డీ ట్యాబ్‌కు వెళ్లి మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, పేరు వివరాలు ఇవ్వాలి. అనంతరం క్యాటగిరీలు సెలెక్ట్ చేసుకొని మార్కెటింగ్
కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు.
మొబైల్ నంబర్ నుంచి START DND అని టైప్ చేసి 1909 నంబర్‌కు మెసేజ్ పంపాలి. అందులో వచ్చే క్యాటగిరీలు సెలెక్ట్ చేసుకొని బ్లాక్ చేయొచ్చు. అనవసర వాయిస్ కాల్స్, మెసేజ్‌లకు కూడా అడ్డుకట్ట వేయొచ్చు.