త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్.. 13.23 శాతం ఓట్లు నమోదు
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అగర్తల: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన బొర్డోవాలి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం ఓట్లు నమోదయ్యాయి.
UPDATE | #TripuraAssemblyElections2023 | 13.23% voter turnout recorded till 9 am pic.twitter.com/fbttQHTc2H
— ANI (@ANI) February 16, 2023
రాష్ట్రంలోని 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వారిలో 20 మంది మహిళలున్నారు. మొత్తం 28.13 లక్షల ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 13.53 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 3337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అధికార బీజేపీ 55 సీట్లలో పోటీలో ఉండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ కేవలం ఐదు సీట్లలో మాత్రమే బరిలో ఉంది. వామపక్ష కూటమిలో సీపీఎం 47 సీట్లలో, కాంగ్రెస్ 13 సీట్లలో పోటీపడుతున్నాయి. తిప్ర మోత 42 మంది అభ్యర్థులను రంగంలో ఉంచారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలలో, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.
#TripuraElections2023 | People exercise their right to vote across all the 60 assembly constituencies in the state.
Visuals from a polling booth in Udaipur of Gomati district. pic.twitter.com/MglRHVQus8
— ANI (@ANI) February 16, 2023
కాగా, విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న అధికార బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షేనని, ఈసారి గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ, లెఫ్ట్-కాంగ్రెస్ కూటములుగా ఏర్పడగా, రాజవంశానికి చెందిన తిప్ర మోత గట్టి పోటీదారుగా నిలిచారు. టీఎంసీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రమే.
#WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r
— ANI (@ANI) February 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

