చండీగఢ్: యాస్ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలపై కూడా బాగానే పడింది. ఇవాళ చండీగఢ్‌లో కూడా యాస్ ప్రభావం కనిపిస్తున్నది. ఈ ఉదయం నుంచి నగరం అంతటా భారీ వర్షం కురవడంతోపాటు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చండీగఢ్ పొరుగున ఉన్న మొహాలి, పంచకులలో సైతం వరుణుడి బీభత్సం కొనసాగింది. ఈ కింది చిత్రాల్లోని దృశ్యాలను చూస్తే ఆయా ప్రాంతాల్లో వర్షం ఎంత బీభత్సం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
Chandigarh: Heavy rain, accompanied with thunderstorm and strong winds, lashes Chandigarh and adjoining areas of Mohali and Panchkula pic.twitter.com/Oqfekcg98H
— ANI (@ANI) May 29, 2021
Trees uprooted following heavy rain and strong winds in Chandigarh. pic.twitter.com/3Wwe7xH49D
— ANI (@ANI) May 30, 2021