Sabarimala | తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మాస పూజలు, 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా అమలు చేస్తామన్నారు.
ఇది విజయవంతమైతే రానున్న మండలం, మకరజ్యోతి సీజన్లో కూడా కొనససాగిస్తామని చెప్పారు. ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. నేరుగా 18 మెట్లను ఎక్కడానికి అవకాశం కల్పించడం వల్ల భక్తులు దాదాపు 20-25 సెకండ్లపాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.