జైపూర్: అది సీ-130జే సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్. అందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ప్రయాణిస్తున్నారు. ఆ విమానం రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఉన్న నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్‌లో ల్యాండ్ అయింది. అయితే ఇది ఆ ఎమర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రారంభోత్సవంలో భాగంగా జరిగిన ల్యాండింగ్. ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురితోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.
#WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u
— ANI (@ANI) September 9, 2021