ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో మంచు విపరీతంగా కురుస్తోంది. అసలే చలికాలం.. మన దగ్గరే చలికి వణికిపోతున్నాం. ఇక హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎండాకాలం కూడా మంచు కురుస్తుంది. తాజాగా రాష్ట్రం మొత్తం హిమపాతంతో కప్పుకుపోయింది. మంచుదుప్పటి పరుచుకుంది. సిమ్లాలో అయితే జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావడం లేదు. రోడ్లు మొత్తం మంచుతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే ట్రాక్స్ కూడా కనిపించనంత మంచు ట్రాక్స్ మీద పరుచుకున్నా.. రైళ్లు మాత్రం సిమ్లాలో యధావిథిగా నడుస్తున్నాయి. ట్రాక్ కనిపించకున్నా సిమ్లాలో ఓ రైలు ఎలా పరుగులు పెడుతోందో చూడండి.
#WATCH | Himachal Pradesh: Train services continue amid snowfall in Shimla. pic.twitter.com/TOmOs3luT0
— ANI (@ANI) February 4, 2022