ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ట్రెయిన్ ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ చెప్పినా.. ఒక్కోసారి ప్యాసెంజర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడిపోతుంటారు. ప్లాట్ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోతుంటారు. కొందరు ట్రాక్స్ మీద పడిపోతుంటారు. ఇలా చాలా రకాలుగా రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా గుజరాత్లోని సూరత్ రైల్వే స్టేషన్లో ఓ ఘటన చోటు చేసుకుంది. సూరత్ స్టేషన్ నుంచి ఓ ట్రెయిన్ బయలుదేరింది. నెమ్మదిగా స్పీడ్ పెరుగుతోంది. ఇంతలో ఓ ప్యాసెంజర్.. ట్రెయిన్ నుంచి దిగబోయాడు. జారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు మధ్యలో పడిపోయాడు. దీంతో ప్రయాణికులంతా గట్టిగా అరిచేసరికి… వెంటనే అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్(రైల్వే గార్డ్) వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. రైలు ఆగగానే.. ఆ ప్రయాణికుడు ప్లాట్ఫామ్ నుంచి పైకి లేస్తాడు. ఎటువంటి గాయాలు కాకుండా ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడివారంతా ట్రెయిన్ డ్రైవర్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Ministry of Railways (@RailMinIndia) March 1, 2022