చెన్నై: ప్రియుడితో కలిసి నివసించేందుకు ఒక బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఫుట్‌పాత్‌పై నిద్రించిన ఆమెను ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి గమనించాడు. పోలీస్ బూత్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరిచి ఏడ్వడంతో ఆమెను వదిలేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ట్రాఫిక్ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. (cop rapes runaway girl) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. జనవరి 25న మైలాపూర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాయ్ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఇంటి నుంచి పారిపోయింది.
కాగా, రాత్రి వేళ ఫుట్‌పాత్‌పై నిద్రించిన ఆ బాలికను ట్రాఫిక్ పోలీస్ అధికారి రామన్ గమనించాడు. ఇంటి వద్ద దింపుతానని చెప్పి పోలీస్ బూత్‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరిచి ఏడ్వటంతో వదిలేసి వెళ్లిపోయాడు.
అనంతరం ఆ బాలిక తన ఇంటికి చేరుకున్నది. అయితే తల్లి మరో వ్యక్తితో తనకు పెళ్లి చేస్తుందని ఆమె అనుమానించింది. దీంతో మళ్లీ ఇంటి నుంచి పారిపోయిన ఆ బాలిక తన బాయ్ ఫ్రెండ్‌ను కలిసింది. అతడి బంధువుల ఇంట్లో వారిద్దరూ ఆశ్రయం పొందారు.
మరోవైపు బాలిక మిస్సింగ్‌పై ఆమె తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో ట్రాక్ చేశారు. ప్రియుడితో కలిసి ఆమె ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ట్రాఫిక్ పోలీస్ అధికారి రామన్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. అలాగే ప్రియుడి వద్దకు చేరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు చెప్పింది.
దీంతో ట్రాఫిక్ పోలీస్ అధికారి రామన్, బాలిక బాయ్ ఫ్రెండ్, అతడి తల్లిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీస్ రామన్‌ను అరెస్ట్ చేశారు. బాలిక ప్రియుడైన మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.