చెన్నై: రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీస్ (Traffic Cop) ప్రయత్నించాడు. రోడ్డు మధ్యలోకి ఒక్కసారిగా వచ్చాడు. ఒక కారు డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారు దానిని ఢీకొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. పెరుంగళత్తూరులో హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించాడు. ఉన్నట్టుండి రోడ్డు మధ్యలోకి వచ్చాడు. ఇది చూసి వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ కారు వెనుక వస్తున్న మరో కారు దానిని ఢీకొట్టింది. ఆ కారు ముందు భాగం ధ్వంసమైంది.
కాగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాక్స్టర్న్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇండియన్ ట్రాఫిక్ పోలీసుల తీరును విమర్శించాడు. మరీ దారుణంగా ప్రవర్శిస్తున్నారని ఆరోపించాడు. ‘ఆన్లైన్లో చలాన్లు జారీ చేస్తున్నప్పుడు వాహనాలను హైవేపై ఎందుకు ఆపాలి? కారులు ఢీకొనడం ఎవరి పొరపాటు? అనవసరంగా వేధించిన తర్వాత వారికి రూ.500 ఇవ్వాలా?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Another incident where a stupid traffic cop came in middle of the road to stop the car and accident happened.
Indian traffic cops are worst than chhapris! pic.twitter.com/3d3bQhtq09
— Maxtern (@RealMaxtern) November 12, 2024