భోపాల్: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఒక కారు ఢీకొట్టింది. కారు బానెట్‌పై ఆయన పడినప్పటికీ ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. (Traffic Constable Dragged On Car’s Bonnet) చివరకు ఒక మలుపు వద్ద ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు నుంచి అదుపు తప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం మాధవ్ నగర్ జంక్షన్ వద్ద ఏఎస్ఐ సతీషన్ సుధాకరన్, హోంగార్డు రాకేష్‌తో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్రిజేంద్ర సింగ్ విధుల్లో ఉన్నాడు.
కాగా, నంబర్ ప్లేట్ లేని ఎర్రటి కారు వంతెన వైపు నుంచి రావడాన్ని కానిస్టేబుల్ బ్రిజేంద్ర గమనించాడు. కారును ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే కారు డ్రైవర్ స్పీడ్ పెంచాడు. కానిస్టేబుల్ బ్రిజేంద్రను ఢీకొట్టడంతో కారు బానెట్‌పై అతడు పడ్డాడు. అయినప్పటికీ కారును డ్రైవర్ ఆపలేదు. దీంతో బానెట్‌పై పడిన కానిస్టేబుల్‌ను 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. చివరకు హరిశంకర్ పురం కూడలి వద్ద డ్రైవర్ ఒక్కసారిగా కారును మలుపు తిప్పి పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ బ్రిజేంద్ర సింగ్ రోడ్డుపై పడ్డాడు. ఆయన తలకు గాయం కావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారుతో పరారైన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Traffic Constable Hit By Car, Dragged On Bonnet for 100 Metres During Routine Vehicle Check In Gwalior#Gwalior #MPNews #MadhyaPradesh #viralvideo pic.twitter.com/r5sE0bSlcT
— Free Press Madhya Pradesh (@FreePressMP) October 16, 2024