సర్వే పేరుతో జీఎస్టీ అధికారులు వేధిస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న యూపీ వ్యాపారులు
GST | క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు.
లక్నో: క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు. తాము సకాలంలో పన్నులు చెల్లిస్తున్నామని, అయినా సర్వేల పేరుతో నిత్యం షాపులపై అధికారులు దాడులు చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీశ్ అసిజాకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీఎస్టీ అధికారులు ఎలక్ట్రానిక్ షాపులు, గ్రాసరీ స్టోర్స్, బట్టల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నారని, దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని వాపోయారు. జీఎస్టీ సర్వే పేరుతో అధికారులు తమను వేధిస్తున్నారని చెప్పారు.
యూపీలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీఎస్టీ అధికారులు వాణిజ్య సముదాయాలపై తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్న వ్యాపారస్థులు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. జీఎస్టీ అధికారులు నిత్యం దాడులకు పాల్పడుతూ తమను వేధిస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటున్నారు. లలిత్పూర్ జిల్లాలో రాష్ట్ర మంత్రి మనోహర్ లాల్ పంత్, ఎమ్మెల్యే రామ్‌రతన్ కుష్వాహాను ఆదివారం ఘెరావ్ చేశారు. జీఎస్టీ దాడులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

