ముంబై: వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపాటు ట్రాలీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
మరోవైపు ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తామని తెలిపారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
महाराष्ट्र के नानदेड में बड़ा हादसा..
ट्रैक्टर ट्रॉली कुएं में गिरी..
7 लोगो की मौत..
कुछ और लोगों की तलाश जारी.#Maharashtra pic.twitter.com/CQQlJ69sXZ— Vivek Gupta (@imvivekgupta) April 4, 2025